Telangana Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేల వద్దకు వచ్చిన కేటీఆర్.. కాషాయ రంగు షర్ట్ వేసుకొచ్చిన రాజాసింగ్ ని ఉద్దేశించి సెటైరికల్ గా మాట్లాడారు. షర్ట్ కలర్ కళ్లకు గుచ్చుకుంటుందని.. ఆ రంగు తనకు ఇష్టం ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాషాయ రంగు చొక్కా భవిష్యత్ లో మీరూ వేసుకోవచ్చేమో అని రాజాసింగ్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.
షర్ట్ కలర్ నచ్చలేదన్న కేటీఆర్.. కౌంటర్ ఇచ్చిన రాజాసింగ్
-