ఇద్దరబ్బాయిలు అలా వెంటబడ్డారని ప్రాణాలు తీసేసుకుంది

-

నల్లగొండ(Nalgonda) జిల్లా దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఒకరు, పెళ్లి అంటూ మరొకరు వెంటపడ్డారని యువతి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్ కి గురిచేసింది. వివరాల్లోకి వెళితే… మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో కల్యాణి(19) అనే యువతిని అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు కొంతకాలంగా ప్రేమ, పెళ్లి అంటూ వేధిస్తున్నారు.

- Advertisement -

Nalgonda | ఎవరికి వారే ప్రేమించకుంటే నీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి కల్యాణికి సదరు యువకులు ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో విరక్తి చెందిన కల్యాణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. అనంతరం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. కల్యాణి తల్లిదండ్రులు పక్కింటివారిని అలర్ట్ చేయగా… వారు హుటాహుటిన అపస్మారకస్థితిలో ఉన్న కల్యాణిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ కల్యాణి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: ప్రేమోన్మాది ఘాతుకం… వరంగల్ లో అర్ధరాత్రి డబుల్ మర్డర్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...