Bandi Sanjay clarity on BJP- TDP Alliance in Telangana: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ తో దూకుపోతుంది. నేడు జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో టీడీపీ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు స్టేట్ చీఫ్ బండి సంజయ్. చంద్రబాబు ఖమ్మం సభ అనంతరం తెలంగాణాలో టీడీపీ, బీజేపీ తో పొత్తు పెట్టుకోనుందనే ప్రచారం జోరందుకుంది.
అంతే కాదు.. మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి సైతం టీడీపీ పొత్తుపై స్పష్టత ఇవ్వాలని అధిష్టానాన్ని అడిగారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టగా.. తెలంగాణ ప్రజల నుండి కాంగ్రెస్ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా పట్టుబట్టారు. కార్యకర్తల్లో కూడా సందేహం నెలకొన్న నేపథ్యంలో బండి సంజయ్ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ తో పొత్తు అనేది లేదని బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం చేశారు. ఈ విషయం కార్యకర్తలకు చేరవేసే బాధ్యతలు నాయకులు తీసుకోవాలని సూచించారు. బీజేపీ హై కమాండ్ ఇటీవల 119 నియోజకవర్గాల్లో పాలక్ లను నియమించింది. ఇందులో సీనియర్లను కూడా నియమించారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా రానున్నారు.