Bandi Sanjay |రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి(Medico Preethi) ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆత్మాహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా.. దీన్ని చిన్న కేసుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. వందశాతం ఇది లవ్ జీహాదీ కేసే అని, రాగింగ్ కూడా ఇందులో భాగమైందని తీవ్ర ఆరోపణలు చేశారు.
సీఎం కేసీఆర్‌ది ఐరన్ లెగ్ అని, అందుకే కొండగట్టులో చోరీ జరిగిందని ఆరోపించారు. గర్భగుడికే రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్రాన్నేం కాపాడుతారని సెటైర్ వేశారు. మీరు దర్శించుకున్న కొండగట్టుపైనైనా స్పందించాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి ప్రీతి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.