Bandi Sanjay |రేవంత్ రెడ్డి కన్నీళ్లపై బండి సంజయ్ సెటైర్

-

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు ముట్టాయని ఈటల(Etela Rajender) చేసిన వ్యాఖ్యలను సమర్ధించిన బండి.. మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తన పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి(Revanth Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చానని ఈటల రాజేందర్ ఎక్కడ అనలేదని చెప్పారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి ఇచ్చానని మాత్రమే అన్నారని స్పష్టం చేశారు. కర్ణాటక(Karnataka) ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు బీఆర్ఎస్(BRS) ఆర్థిక సహాయం చేస్తుందన్న బండి సంజయ్(Bandi Sanjay).. రాజ్దీప్ సర్దేశాయి కూడా.. బీఆర్ఎస్ దేశమంతా పార్టీలకు ఆర్థిక సాయం చేస్తుందనే అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానికి ఎలాంటి ప్రూఫ్‌లు ఉన్నాయని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం ఇవే మాటలు అంటున్నారన్న ఆయన.. బీఆర్ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఇదే విషయం ప్రచారం అయిందని ఆయన చెప్పారు. మునుగోడు ఓటర్లు స్వయంగా మాట్లాడుకున్నారని తెలిపారు.

Read Also: రాహుల్ గాంధీని అలా చూస్తే కళ్లలో నీళ్లు తిరిగాయి: Revanth Reddy

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...