బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్(Bandi Sanjay) రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ హైకమాండ్ సంచలన మార్పులు చేస్తుండటం పార్టీ శ్రేణులకు కలవరపాటుకు గురిచేస్తోందని చర్చించుకుంటున్నారు. కాగా, ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా దుగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari)ని నియమించారు.
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)తో గంటన్నరకు పైగా చర్చలు జరిపిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం బండి సంజయ్(Bandi Sanjay ) ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు మూడున్నరేళ్ళ పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్ మూడేళ్ళ పదవీకాలం ముగిసినా తాత్కాలిక పద్ధతిన ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆయనకు కేంద్ర కేబినెట్‌లో అవకాశం లభించనున్నది. సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని నడ్డా ఇచ్చిన హామీతో ఆయన రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన స్టేట్ చీఫ్‌గా రాజీనామా చేయడం పార్టీలో సంచలనం రేకెత్తించింది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.
Read Also:
1. కాంగ్రెస్ పార్టీని నడపలేక రాహుల్ పారిపోయారు: కిషన్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat