హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని దేవీ థియేటర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) బలగం సినిమా చూశాడు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మానవ సంబంధాలు తెలియని కేసీఆర్‌కు బలగం సినిమా అంకితమన్నారు. “బలగం సినిమా అద్భుతంగా ఉంది. మా కరీంనగర్‌కి చెందిన వేణు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ బాధ్యతల గురించి చక్కగా చూపించారు. మన హిందు సనాతన ధర్మాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. మనిషి బతికున్నప్పుడు, చనిపోయాక ప్రాముఖ్యతను బాగా చూపంచారు.
ప్రస్తుత సమాజంలో ఒకరు చనిపోతే దాన్ని 11 రోజులు పండుగలా చేసుకుంటున్నారు.. కానీ దాని ప్రాముఖ్యత ఎవరి తెలీదు. పిట్టకి పెడుతున్నారు కానీ కాకి ముట్టిందా లేదా అని పట్టించుకోట్లేదు. పేరు, పబ్లిసిటీ, కలెక్షన్స్ కోసం చూడకుండా ఒక మంచి సినిమాని తీసిన వేణుకి నా అభినందనలు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వేణు ఇప్పుడు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ సినిమా కేసీఆర్(KCR) చూడాలి. చూసి బంధాలు, వాటి విలువలు తెలుసుకోవాలి. కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యం. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలి” అని బండి సంజయ్(Bandi Sanjay) సూచించారు.
Read Also: జ్యోతిరావు ఫూలే ఎంత గొప్పోడో అందరూ తెలుసుకోవాలి: సీఎం కేసీఆర్
Follow us on: Google News, Koo, Twitter