అధికార లక్ష్యం దిశా గా బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆ పార్టీ చూపు ఖమ్మం జిల్లా వైపు పడింది. బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) తో బీజేపీ నాయకులు సమావేశం కానున్నారు. అసలేం ప్రాబల్యం లేని ఖమ్మం జిల్లాలో పొంగులేటిని చేర్చుకొని పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. నేడు చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్(Etela Rajender) తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖమ్మం వెళ్లనున్నారు.
ఇప్పటికే పొంగులేటి(Ponguleti Srinivas Reddy) ఏదైనా ఒక నేషనల్ పార్టీ చేరుతారని ప్రచారం జరిగింది. సునీల్ కనుగోలు కాంగ్రెస్ లో చేరికపై భేటీ తర్వాత ఖమ్మం కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రేణుక చౌదరి విమర్శలు చేసారు. శ్రీనివాస్ రెడ్డి చేరికపై కాంగ్రెస్ భిన్న అభిప్రాయాలు రావడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ భేటీ అనంతరం పొంగులేటి బీజేపీ లో చేరుతారా? లేదా అనేది స్పష్టత రానుంది.
ఖమ్మంలోని 10 స్థానాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వబోనని శపథం చేసిన పొంగులేటి.. కేసీఆర్(KCR) ను మూడవసారి సీఎం కానివ్వకుండా ఏ పార్టీ చేస్తుందో ఆ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పిన విషయం తెలిసిందే.