ప్రధాని నరేంద్ర మోడీపై సొంత పార్టీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత ఏ.చంద్రశేఖర్(Chandrashekhar) ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడటం కాదు.. చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రజలు అడుగుతున్నారని మోడీ(Modi)ని ప్రశ్నించారు. కేసీఆర్(KCR) ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటేనే బీజేపీని ప్రజలు నమ్ముతారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో అందర్నీ అరెస్ట్ చేసి.. ఒకరిద్దరిని ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంలో హైకమాండ్ తప్పుచేసిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
బండి సంజయ్ పాదయాత్ర వలనే బీఆర్ఎస్(BRS)కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ఎదిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందన్న చర్చ ప్రజల్లో జరగటానికి కారణం కూడా బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. నియోజకవర్గంలో రెండు వేలు ఉన్న బీజేపీ(BJP) ఓట్లను బండి సంజయ్ 40 వేలకు తీసుకెళ్ళారన్నారు. గతంలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా పార్టీని బలోపేతం చేస్తే.. ఎన్నికల ముందు బండిని తప్పించటం ఏంటని ఆయన నిలదీశారు. ఈటల రాజేందర్(Eatala Rajender)కు ఇచ్చిన నామ్ కే వాస్తే పదవితో ఉపయోగం లేదన్నారు. లేని పదవిని సృష్టించి ఈటలకు పదవిని ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని చంద్రశేఖర్(Chandrashekhar) ప్రశ్నించారు.
Read Also: ప్రధాని మోడీ వరంగల్ సభకు కీలక నేతలు గైర్హాజరు!
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat