తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. ఇప్పటికే 30 నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ నిర్ణయించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్(Congress) పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్(BRS) లో చేరారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్డుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఎప్పటికీ వేరు కాదని స్పష్టంచేశారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం.. మరి కేసీఆర్ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు.