Guvvala Balaraju: తెలంగాణ ప్రభుత్వ తీరుపై అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది క్రీడాకారులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో ఇళ్ల స్థలాలు ఇచ్చి.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు(kinnera mogulaiah) మాత్రం ఎల్బీనగర్‌లోని బీఎన్‌రెడ్డిలో స్థలం ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మొగిలయ్యకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తానే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.