MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం ముంబయిలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహారాష్ట్ర(Maharashtra) ప్రజల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్(BRS) అద్భుతంగా పనిచేయడానికి సిద్ధమైందన్నారు. తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
MLC Kavitha | తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్రలోనూ ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అనేక విజ్ఞప్తులు చేశారన్నారు. దేశంలో ఇప్పటివరకు విద్యుత్, తాగు, సాగునీరు వంటి కనీస సదుపాయాలను ఎవరూ కల్పించలేదన్నారు. కానీ, తెలంగాణ(Telangana)లో మాత్రం 98 శాతం సదుపాయాల కల్పనను పూర్తి చేశామని, ప్రజల ఎజెండానే ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీపై పార్టీ ప్రకటన చేస్తుందని, మహారాష్ట్ర ప్రగతిశీల అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం అవుతుందని ప్రకటించారు.’