Amit Shah | ‘ఎట్టి పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రిని బీజేపీలో చేర్చుకోము’

-

Amit Shah | బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్(Nitish Kumar) బీజేపీలో చేరకుండా శాశ్వతంగా తలుపులు మూసేశామని అన్నారు. జేడీయూ, ఆర్జేడీలది అపవిత్ర కూటమి అని వ్యాఖ్యానించారు. బిహార్‌లోని వెస్ట్ చంపరాన్ జిల్లాలోని లారియాలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అమిత్‌షా పాల్గొన్నారు.

- Advertisement -

Amit Shah | ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని కావాలనే కోరికతోనే ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపారని ఆరోపించారు. నితీష్ కుమార్ బిహార్‌ను జంగల్ రాజ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్, ఆర్జేడీలను విమర్శించిన నితీష్ కుమార్ ఇప్పుడు పదవి కోసం వారి పంచాన చేరాడని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీయే అధిక సీట్లను గెలుచుకున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ సీఎం పదవినీ నితీష్ కుమార్‌కే ఇచ్చారని గుర్తుచేశారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...