CM KCR |కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‌సభలో వేటు పడింది. ఎంపీగా రాహుల్ అనర్హుడని లోక్‌సభ సెక్రటరీ జనరల్ ప్రకటించింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పందించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోడీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని అభిప్రాయపడ్డారు. మోడీ(Modi) పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది.. ప్రతిపక్ష నాయకులను వేధించడం బీజేపీ పాలనలో పరిపాటిగా మారిపోయిందన్నారు. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని గుర్తుచేశారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని దేశ ప్రజలకు కేసీఆర్(CM KCR) పిలుపునిచ్చారు.
Read Also: రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై ఘాటుగా స్పందించిన రేవంత్ రెడ్డి
Follow us on: Google News Koo Twitter