బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

-

ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్(Kusuma Jagadish) గుండెపోటుతో కన్నుమూశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేస్తున్న ఆయన ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అజర ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. కాగా కొద్ది నెలల క్రితమే ఆయనకు గుండెపోటు రావటంతో వైద్యం చేయించగా కోలుకున్నారు. కానీ ప్రస్తుతం మళ్లీ హార్ట్ స్ట్రోక్ రావడంతో ప్రాణాలు కోల్పోయారు. జగదీష్(Kusuma Jagadish) మృతి పట్ల సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read Also:
1. ములుగు BRS లో విషాదం.. కీలక నేత మృతి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...