తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతుబంధు(Rythu Bandhu) నిధుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈనెల 26 నుంచి రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోడు భూముల పట్టాలు పంపిణీ తర్వాత వారికి కూడా రైతుబంధు డబ్బులు అందించాలని.. అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావును, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే రైతులు విత్తనాలు వేసుకోడానికి భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక వానలు పడితే విత్తనాలు పెట్టడమే తరువాయి. అలాగే నార్లు కూడా పోయడం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో రైతుల పెట్టుబడికి ఇబ్బంది కాకూడదని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నార్లు కూడా పోయడం మొదలుపెట్టేశారు. గతంలో రైతుబంధు పొందిన వారితో పాటు కొత్తగా పాస్ బుక్ వచ్చిన వారికి ఈసారి రైతుబంధు(Rythu Bandhu) అందనుంది.
Read Also:
1. భారత నిఘా విభాగం ‘రా’ నూతన అధిపతిగా రవి సిన్హా
2. ఆ నిధులను సొంత అవసరాలకు వాడుకున్నా.. తప్పేంటి?: BJP MP
Follow us on: Google News, Koo, Twitter, ShareChat