ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్(CM KCR), మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని సీఎం అన్నారు. నష్టపోయిన రైతుకు ప్రతి ఎకరాకు 10 వేల చొప్పున వెంటనే సాయం అందిస్తామని.. కౌలు రైతులను ఆదుకునే ఏర్పాట్లు చేస్తామని భరోసా కల్పించారు. 79 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని సీఎం తెలిపారు. వెంటనే 228 కోట్లను విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
పంట నష్టం పై కేంద్రానికి ఎలాంటి నివేదికలు పంపడంలేదని.. గతంలో అనేకసార్లు పంట నష్టానికి సంబందించి నివేదికలు పంపినప్పటికీ ఎలాంటి సాయం కేంద్రం అందించలేదని సీఎం(CM KCR) పేర్కొన్నారు. తమ రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందని స్పష్టం చేసారు.
Read Also: రాహుల్ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష
Follow us on: Google News Koo