నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్(MLC Candidate Ashok) పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు ఎవరంటూ అశోక్ పై దాడి చేశారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేసి, కెమెరాలు, ఫోన్లు ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.