CM KCR |కర్ణాటకలో మే 20వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా మే 20వ తేదీన సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. అయితే ఏపీ సీఎం జగన్‌కు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరు అవుతారని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) నేరుగా పోటీ చేయకపోయినా జేడీఎస్(JDS)కు సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఓటమిని కేసీఆర్(CM KCR) పరోక్షంగా కోరుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్లరని సమాచారం.
Read Also: ఆ సినిమా చూసి కంటతడి పెట్టిన RRR సృష్టికర్త
Follow us on: Google News, Koo, Twitter