Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బినోయ్ బాబుల బెయిల్ పిటిషన్‌పై గురువారం రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న తర్వాత నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. లిక్కర్ స్కాంలో(Delhi Liquor Scam) అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బినోయ్ బాబులదే కీలక పాత్ర అని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో ఈడీ అధికారుల వాదనలు విన్న స్పెషల్ కోర్టు.. ఈడీ వాదనలు ఏకీభవించి నలుగురు నిందితుల బెయిట్ పిటిషన్‌ను తిరస్కరించింది.