వరంగల్ జిల్లాలో లీకైన హిందీ పేపర్ వ్యవహారంపై పోలీస్ కమిషనర్ రంగనాథ్(CP Ranganath) స్పందించారు. వాట్సాప్లో పేపర్ వైరల్ కావడంపై విచారణ చేపడుతున్నామని చెప్పారు. ఇతర జిల్లాల వాట్సాప్లోనూ పేపర్ వైరల్ అయిందని తెలిపారు. ఇది పేపర్ లీకైనట్లు కాదని, ఎగ్జామ్ స్టార్ట్ అయిన గంటన్నర తర్వాత పేపర్ బయటకు వచ్చిందన్నారు. వాట్సాప్లో ప్రశ్నాపత్రం లోకేషన్ అధారంగా ట్రేస్ చేస్తున్నమని చెప్పారు. పేపర్ లీక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఏ సెంటర్ నుంచి పేపర్ లీక్ అయిందో దర్యాప్తులో తేలుతుందని సీపీ రంగనాథ్ చెప్పారు. ఘటనకు ఎవరు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ వెల్లడించారు.
- Advertisement -
Read Also: బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్లంతా రేపిస్టులే: బండి సంజయ్
Follow us on: Google News, Koo, Twitter