ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో వ్యవహారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) శనివారం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ మాజీ సీఎం మనీశ్ సిసోడియా, అరుణ రామచంద్ర పిళ్లైతో పాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కవితతో పాటు ఏడుగురిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. బీజేపీని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ విచారణలు కామన్ అని వ్యాఖ్యానించారు. మోడీకి కవిత జిందాబాద్ కొట్టిన వెంటనే విడుదల చేస్తారని ఎద్దేవా చేశారు. లేదని ఇలాగే మొండికేస్తే కవితను జైళ్లో పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. ప్రత్యర్థులను చెప్పు చేతల్లో పెట్టుకోవాలనేదే బీజేపీ ఉద్ధేశ్యమని.. ప్రశ్నించినా.. ఎదిరించినా.. విమర్శలు చేసినా ఇటువంటి ఇబ్బందులు పెట్టటం బీజేపీకి అలవాటేనని అన్నారు.
Read Also: మేయర్ గద్వాల విజయలక్ష్మి అరెస్ట్
Follow us on: Google News