రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఓట్ల మీదనే ప్రేమ అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు(Munugodu) ఎన్నికలని అన్నారు. మునుగోడు హామీలు ఒక్కటైనా నెరవేర్చాడా? అని ప్రశ్నించారు. గత బడ్జెట్‌లో రూ.17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు.
ఎన్నికలు వస్తేనే తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)కు ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఎందుకు ఇవ్వలేదు.. మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు.. మిషన్ భగీరథ నీళ్ళు తాగడానికి పనికిరావడం లేదు. మళ్లీ మినరల్ వాటర్ ప్లాంట్‌కి గిరాకీ పెరిగింది.. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు. 2011లో గ్రూప్ 1 వేస్తే 13 ఏళ్లకు మళ్లీ మొన్న వేశారు. రెండవసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్‌సీలో నాలుగు పరీక్షలు నిర్వహిస్తే అన్నీ లీక్ అయ్యాయి. ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్‌పీఎస్‌సీలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను పెడుతున్నారు. 2015లో ఎంసెట్ పేపర్ లీక్ అయ్యింది. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అబాసు పాలైందని ఈటల(Etela Rajender). 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
Read Also: భారీ అంబేద్కర్ విగ్రహానికి అంతర్జాతీయ గుర్తింపు
Follow us on: Google News, Koo, Twitter