Half Day Schools |తెలంగాణలో ఒంటిపూట బడులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్. ఏప్రిల్ 24వ తేదీ వరకు ఒంటిపూట కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. టెన్త్ ఎగ్జామ్స్ ఉన్న సెంటర్లలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
- Advertisement -
Read Also: గ్రూపు-1 ప్రిలిమ్స్ పేవర్ లీక్?
Follow us on: Google News