NIRF Ranking 2023 |2023 సంవత్సరానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(NIRF) కింద విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ వరుసగా అయిదోసారి కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటీ-ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గౌహతి, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే టాప్ 10 విద్యాసంస్థల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు.
ఇక NIRF ర్యాంకింగ్(NIRF Ranking 2023) ప్రకారం యూనివర్సిటీల్లో బెంగుళూరులోని IISC ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, జాదవ్‌పూర్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) పదో స్థానంలో నిలిచింది.