Rain Alert |భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) చల్లటి కబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఈ రెండు రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
Rain Alert |అటు ఏపీలోనూ కొన్ని చోట్ల వర్షాలు పడవొచ్చని తెలిపింది. బంగాళాఖాతం సముద్రం నుంచి తేమ గాలులు రాయలసీమ, కోస్తా జిల్లాల్లోకి వీస్తున్నాయని.. ఈ ప్రభావంతో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తా జిల్లాలతో పాటూ రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, పల్నాడు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరుతో పాటూ మరికొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
Read Also: ఆ సినిమా చూసి కంటతడి పెట్టిన RRR సృష్టికర్త
Follow us on: Google News, Koo, Twitter