ఇకపై మద్యం తాగి రోడ్డెక్కరా? నేరుగా చర్లపల్లి జైలుకే!

-

Hyderabad |మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొంతమంది మారడం లేదు. జరిమానాలు, జైలు శిక్ష వేస్తామన్నా వారిలో మార్పు రావడం లేదు. దీంతో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మందుబాబులకు బ్రేకులు వేసేందుకు మరో రూల్ తీసుకురానున్నారు. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా, కనిష్టంగా జైలుశిక్ష విధిస్తుండే వారు. ఇకపై మాత్రం తనిఖీల్లో పట్టుబడితే.. నేరుగా చర్లపల్లి జైలుకు వెళ్లాల్సిందే. అక్కడ ఉన్న పారిశ్రామిక యూనిట్‌లో మందుబాబులు చేత పనిచేయిస్తారు. దీంతో అక్కడ ఉత్పత్తి అవ్వడంతో పాటు వారిలోనూ మార్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ రూల్‌ అమల్లోకి వస్తే సచ్చినట్టు జైలుకు వెళ్లాల్సిందే. మరి మద్యం తాగి వాహనాలు నడిపి జైలుకు పోయి ఊసలు లెక్కిస్తారో.. లేదా అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుంటారో తేల్చుకోవాలి. పోలీసుల నిర్ణయంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా వెంటే ఈ రూల్ తీసుకురావాలని కోరుతున్నారు.

- Advertisement -
Read Also:
1. కమాండోస్ లేకపోతే చంద్రబాబు అయిపోతారు: స్పీకర్ తమ్మినేని

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...