IT Raids on Minister Mallareddy son Admitted to the hospital with Heartache: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. మంగళవారం మంత్రి ఇళ్లతో పాటు మెడికల్ కాలేజీలు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. మంత్రి నివాసంతో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు ఇతర బంధువుల ఇళ్లపైనా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా.. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -