ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(KA Paul) స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై(Ashwini Vaishnaw) తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో రైల్వే శాఖ మంత్రి ఎవరో ఎవరికి తెలియదని, ఎందుకంటే ప్రధాని మోడీనే అన్ని శాఖలు చూస్తుస్తున్నారని విమర్శలు చేశారు. రైలు ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని, వందలాది మంది చనిపోవడం బాధాకరమన్నారు. ఘటనకు ప్రధాని మోడీ భాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన సంబంధిత అధికారులందరిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ(PM Modi) అన్ని శాఖలను తన ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి.. ఘటనకు కూడా ఆయనే బాధ్యుడన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన చిన్న ఘటనలకే రాజీనామా చేశారని కేఏపాల్(KA Paul) గుర్తుచేశారు.