Telangana Formation day |తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆయన ప్రసగించారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని.. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని వ్యాఖ్యానించారు.
మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కింనందుకు సంతోషంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. తెలంగాణ పదవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Telangana Formation day |అటు కలెక్టరేట్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులను గుర్తుచేసుకున్నారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి వద్ద చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సిరిసిల్ల కలెక్టరేట్ లో మంత్రి కేటీఆర్, సిద్దిపేట కలెక్టరేట్ లో మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి దశాబ్తి వేడుకలను ప్రారంభించారు.