బీఆర్ఎస్(BRS) సర్కార్ పై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతూన్నారని విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్బంగా ఆయన నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ.. ఆత్మ బలిదానాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ.. గతాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ మనం ఆశించిన తెలంగాణ కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఎంతో మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్నారని, భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పెద్ద ఎత్తున జరిగిన పోరాటం తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు కోదండరాం(Kodandaram) తెలిపారు.