ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు టికెట్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, అవసరమనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తా అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపులపై ఇవాళ గాంధీభవన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జాబితా షార్ట్ లిస్ట్ చేయోద్దని పీఈసీలో చెప్పనని తెలిపారు. పీఈసీ సభ్యులు, స్క్రీనింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించాలని అన్నారు. ఇవాళ్టి సమావేశంలో షార్ట్ లిస్ట్ ఉండదని స్పష్టం చేశారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్ అమలు చేస్తామని, లేకుంటే రాజీనామా చేస్తామని తేల్చిచెప్పారు.
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ
ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy ) లేఖ రాశారు. రాష్ట్రంలోని 4,500 మంది ఏఎన్‌ఎంలను రెగ్యూలరైజ్ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఏఎన్‌ఎంలకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. కాగా, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిమెంట్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలతో గతకొన్ని రోజులుగా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఎంపీహెచ్‌డబ్ల్యు నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, ఆరోగ్య భద్రత, తదితర డిమాండ్లతో ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల ఎంపీ కోమటిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యను సర్కార్ దృష్టికి తీసుకెళ్లానని కోరారు. ఈ క్రమంలోనే ఇవాళ ఎంపీ కోమటిరెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.