Delhi Telangana Bhavan | ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను అప్రమత్తం చేసిన కేటీఆర్

-

Delhi Telangana Bhavan | గత కొన్ని రోజులుగా కుంభవృష్టితో కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాదిన వరదలు సంభవించాయి. ముఖ్యంగా 6 రాష్ట్రాల్లో నదులు పొంగిపోర్లుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, బ్రిడ్జీలు, రోడ్లు, వంతెనలు, ఇల్లు కూలిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఎంతోమంది టూరిస్టులు, ప్రాంత వాసులు వరదల్లో చిక్కుకున్నారని తెలుస్తో్ంది. నిన్నటి వరకు వరదల కారణంగా 37 మంది మృత్యువాతపడ్డారు. ఎంతో మంది వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యారు. నిన్నటి వరకు హిమాచల్ ప్రదేశ్‌లో 300 మందికి పైగా జలదిగ్బంధంలో ఉన్నారని సమాచారం.

- Advertisement -

ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కొంతమంది తెలుగు విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మనాలి చిక్కుకుపోయారని, బాధలో ఉన్న వారి తల్లిదండ్రుల నుంచి సమాచారం అందిందన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు సహాయం చేయడానికి న్యూ ఢిల్లీలోని మా రెసిడెంట్ కమిషనర్‌ (Delhi Telangana Bhavan)ను అప్రమత్తం చేశామని తెలిపారు. ఎవరికైనా సహాయం అవసరమైతే వారు తెలంగాణ భవన్, కేటీఆర్ ఆఫీస్‌ను సంప్రదించాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: గొప్ప మనసు చాటుకున్న సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...