Telangana Elections |ఎన్నికల వేళ తెలంగాణ మందుబాబులకు చేదువార్త. ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు వైన్స్, బార్లు మూతపడనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సీఈసీ ఆదేశాల మేరకు ఈనెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని బార్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వైన్స్, బార్ల యజమానులకు సంబంధిత అధికారులు ముందస్తుగా సమాచారం అందించాలని సూచించింది. పోలింగ్ ముగిసిన అనంతరం డిసెంబర్ 1న మద్యం షాపులు తెరుచుకోవచ్చని పేర్కొంది. కాగా రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.