సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో నలుగురు కార్మికులు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి..
-