TSPSC పేపర్ లీక్ వ్యవహారం.. అభ్యర్థులకు కేటీఆర్ కీలక హామీ

0
Minister KTR

Minister KTR |TSPSC పేపర్ లీకేజీ పై నలుగురు మంత్రులు, టీఎస్పిఎస్సి ఛైర్మెన్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. TSPSC ఏర్పడిన నాటి నుండి పారదర్శకంగా 99 పరీక్షలు నిర్వహించామన్నారు. ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల పూర్తి వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చిందని మంత్రి అన్నారు. ఒకేసారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత TSPSC కి దక్కిందని కొనియాడారు. టీఎస్పిఎస్సి పారదర్శకత కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.

రాజ్యాంగబద్దమైన వ్యవస్థలో జరిగిన తప్పిదాన్ని రాజకీయాల కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని, యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని కేటీఆర్(Minister KTR) మండిపడ్డారు. ఈ లీకేజీ వెనుక ఎంతటి వారున్న వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. యువత ఆందోళన చెందవద్దని.. రద్దైన 4 పరీక్షలకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. వాటికి సంబంధించిన మెటీరియల్ ను ఆన్లైన్ లో పెట్టనున్నట్లు తెలిపారు. స్టడీ సర్కిల్ లను మరింత బలోపేతం చేసి.. రీడింగ్ రూమ్ లను 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. క్వాలిఫై అయిన అభ్యర్థుల బాధను ప్రభుత్వం అర్ధం చేసుకుంటుందని.. ప్రభుత్వానికి సహకరించాలని కేటీఆర్ కోరారు.

Read Also: TSPSC రద్దు.. గవర్నర్ తమిళిసై ను కోరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here