TSPSC రద్దు.. గవర్నర్ తమిళిసై ను కోరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

0
RS Praveen Kumar

RS Praveen Kumar |తెలంగాణ బీఎస్పి చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై ను రాజ్ భవన్ లో కలవనున్నారు. టీఎస్పిఎస్సి లో చోటు చేసుకున్న ప్రశ్న పత్రాల లీకేజీ పై పిర్యాదు చేయనున్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని TSPSC బోర్డు ను రద్దు చేసి ఛైర్మెన్ ను తొలగించాలని.. సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరనున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసారు.

TSPSC కి సత్యనారాయణ ను ఏ హోదాలో సభ్యుడి గా నియమించారు అని ప్రశ్నించారు. ఆయన్ను నియమించింది కేసీఆర్ కాదా? ఆయనకున్న రాజకీయ చరిత్ర కనిపించలేదా? మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. వార్త దినపత్రికలో పని చేసారు. ఈ రెండు హోదాలు సరిపోతాయా TSPSC లో పని చేయడానికి అంటూ ఆర్ఎస్పి(RS Praveen Kumar) మండిపడ్డారు.

Read Also: బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సీపీఎం నేత ఏచూరి

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here