బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సీపీఎం నేత ఏచూరి

0
Sitaram Yechury

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల సంక్షేమాన్ని వీడిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కాపలదారుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్‌‌లో ఏర్పాటు చేసిన సీపీఎం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షలు పంపిణీ చేస్తామని చెప్పిన మోడీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు పేరుతో ప్రజలను మోసం చేసిందని నిప్పులు చెరిగారు. నల్లదనాన్ని వెలికి తీయడం కోసం పెద్ద నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతున్న బీజేపీ మాట‌ల్లో వాస్తవం లేద‌న్నారు. కేవ‌లం కార్పొరేట్‌ సంస్థలు దాచుకోవడానికి వీలుగా రూ. 2 వేల నోట్లను ముద్రించార‌ని సీతారాం ఏచూరి(Sitaram Yechury) పేర్కొన్నారు.

Read Also: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సర్కార్ పరిహారం

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here