తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్(KTR) లీగల్ నోటీసులు పంపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరువురిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేశారు. అంతేగాక, ఈ విషయంలో ఇద్దరూ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. రేవంత్, బండి సంజయ్ పదే పదే అబద్ధాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్(Bandi Sanjay), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లు పదేపదే అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన అసత్య ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.
Read Also: పంటనష్టాన్ని వెంటనే అందించండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
Follow us on: Google News, Koo, Twitter