కిషన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఆడబిడ్డను చిత్రహింసలు పెడుతున్న బీజేపీ నేతలు తప్పక.. ఇంతకు రెండింతలు అనుభిస్తారని అన్నారు. కేంద్రానికి తగిన శాస్త్రి తప్పదని.. అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు. కేంద్రం బెదిరింపులకు భయపడే లేదని.. లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ ఆధారం లేకుండా ముందే ఉహించి నవంబర్‌లోనే సెల్ ఫోన్ ఉన్నాయా లేవా నోటీస్లు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడటంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మతి భ్రయమించి మాట్లాడుతున్నాడని మంత్రి(Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: నిలిచిపోయిన వైద్య సేవలు.. నిమ్స్‌లో నర్సుల ఆందోళన

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here