నిలిచిపోయిన వైద్య సేవలు.. నిమ్స్‌లో నర్సుల ఆందోళన

NIMS

హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్(NIMS) ఆసుపత్రిలో నర్సులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట మంగళవారం భారీ సంఖ్యలో నర్సులు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి నర్సులు ఆందోళనకు దిగగా.. ఇంకా నిరసన కొనసాగుతోంది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసెస్ మినహా నిమ్స్‌లో ఇతర వైద్య సేవలు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన ఆపేది లేదని నర్సులు చెప్పారు. ఇంఛార్జి డైరెక్టర్ అదనపు డ్యూటీలు వేస్తూ ఒత్తిడికి గురి చేస్తున్నారని నర్సులు ఆరోపించారు.

డ్యూటీలకు రావడం లేదంటూ ముగ్గురి నర్సులకు నిమ్స్(NIMS) డైరెక్టర్ మెమోలు జారీ చేశారు. అయితే ఈ మెమోలను వెనక్కి తీసుకోవాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత డైరెక్టర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ లెక్క ప్రకారం 2300 నర్సులు పని చేయాల్సి ఉండగా.. కేవలం 800 మంది మాత్రమే పని చేస్తున్నట్లు తెలిపారు. రోగుల రద్దీకి తగ్గట్లుగా సిబ్బంది లేకున్నా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తున్నప్పటికీ డైరెక్టర్ గుర్తించడం లేదన్నారు. ప్రధానంగా నిమ్స్‌లో రెగ్యులర్‌గా పనిచేసే 500 మంది నర్సింగ్ స్టాఫ్‌పై తీవ్ర పని వత్తిడి ఉందన్నారు.

Read Also: నాటు నాటు పాటపై ఎలాన్ మస్క్ ప్రశంసలు

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here