ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలను(Assembly Session) ఈసారి 30 రోజుల పాటు నిర్వహించాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని, ఈ వర్షాలు, వరదల నష్టం, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కీలకంగా చర్చించాలని డిమాండ్ చేశారు.
అంతేగాక, కేంద్రం నిధులపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరారు. వరదలపై సమీక్ష చేసేందుకు ఫీల్డ్ విజిట్‌కు వెళ్దామని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌కు ఇవే ఆఖరి అసెంబ్లీ సమావేశాలు అని సూచించారు. కాగా, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి.
వరంగల్ నగరంలోని అనేక కాలనీలో జరదిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం చెరువులు కుంటలు, కబ్జాకు గురికావడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఇళ్లలోకి నీరు చేరుకున్నాయి. గ్రామాలకు గ్రామాలే కనుమరుగైపోయాయి. దీంతో దీనిపై చర్చించి బాధితులను ఆదుకునేలా ప్రభుత్వం అసెంబ్లీలో కృషి చేయాలని రఘునందన్ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు.