ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha).. ఈడీ అధికారి జోగేంద్రకు మంగళవారం లేఖ రాశారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను మీకు సమర్పిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు. తనను రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని అన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందని, ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అని ఆమె ప్రశ్నించారు. ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్న విషయంలో తనకు కనీసం సమన్లు కూడా జారీ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.
ఏ ఉద్దేశ్యంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనన్నారు. తప్పుడు ఆరోపణల మూలంగా తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని కవిత(MLC Kavitha) ఆరోపించారు.
Read Also: నేను చనిపోలేదు.. బతికే ఉన్నాను: కోట శ్రీనివాసరావు
Follow us on: Google News Koo