బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సొంత పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్లపై అర్వింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించబోనని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు. వెంటనే ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదని, కోఆర్డినేషన్ సెంటర్ అని వ్యాఖ్యానించారు. కాగా, మరోపక్క.. కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నారు. వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళలు బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read Also: సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల.. ప్రాబ్లం ఇదే!
Follow us on: Google News


 
                                    