నాగార్జునసాగర్(Nagarjuna Sagar) నీటి విడుదలలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ వర్చువల్‌గా హాజరయ్యారు. వివాదం పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
మరోవైపు సాగర్(Nagarjuna Sagar) పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డు(Krishna River Management Board), కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్(CRPF) బలగాలు డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలా ఉంటే గురువారం ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.