Chandrababu | చంద్రబాబు జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఖరారు..

-

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సతీసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఇవాళ విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సింహాచలం అప్పన్న, మంగళవారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయానికి కూడా చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు.

- Advertisement -

Chandrababu Districts Tour | ఈనెల 10 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఈనెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో జరగనున్నాయి. మరోవైపు ఈనెల 6 లేదా 8వ తేదీ లోపు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఢిల్లీ వెళ్లి సీఈసీకి ఫిర్యాదుచేయనున్నారు .

Read Also: ఏపీలో వచ్చే ఏడాది సెలవుల జాబితా ప్రకటన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Orange Benefits | శీతాకాలంలో నారింజ పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..!

Orange Benefits | శీతాకాలం అంటేనే ఎముకలు కొరికే చలి, కారుతున్న...

Rashmika | ‘సల్మాన్ చాలా కేర్ తీసుకుంటాడు’.. రష్మిక మందన

రష్మిక మందన(Rashmika).. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందీ ముద్దుగుమ్మ. ఈ...