Nagole Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి, రవాణా వ్యవస్థను పటిష్టం చేసెందుకు మంత్రి కేటీఆర్ నేడు నాగోల్ ఫ్లై ఓవర్‌ని ప్రారంభించనున్నారు. 143.58 కోట్ల రూపాయలతో జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నాగోల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది.ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవుతో 6 దిశలతో నిర్మించబడింది. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం కలిగి ఉంటుంది.
కేటీఆర్ ట్వీట్: ‘‘హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ ( Nagole Flyover) నేటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఆరు లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది’’ అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ ఇవ్వాళటి నుండి అందుబాటులోకి వస్తుంది. ఆరు లైన్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు ఉంది. @TSMAUDOnline @GHMCOnline pic.twitter.com/a4S5UsKti4
— KTR (@KTRTRS) October 26, 2022
Read also: కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తండ్రి