Nagole Gold Theft Case: పక్కా రెక్కీతో అట్టాక్‌‌కు ప్లాన్..సీపీ మహేష్ భగవత్

-

Nagole Gold Theft Case gun firing in gold shop: ఎల్బీనగర్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్నేహపురి కాలనీలో మహదేవ్ జ్యువెలరీ షాప్‌‌లో దుండగులు చొరబడిన కాల్పులు జరిపి షాపులో ఉన్న బంగారంతో ఉడాయించిన సంఘటన తెలిసిందే. కాగా.. దుకాణం మూసివేసే సమయానికి షాపులోకి చొరబడిన ఇద్దరు దుండగులు లోపలి నుంచి శెట్టర్ మూసి వేసి షాప్ యజమాని కళ్యాణ్ చౌదరిపై ఒక రౌండ్ కాల్పులు (gun firing) జరిపారు.

- Advertisement -

అనంతరం షాపులో పని చేసే వ్యక్తి సుక్‌దేవ్‌పైనా రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. షాపులో తుపాకీ కాల్పుల శబ్ధం, అరుపులు వినబడటంతో పక్కనే ఉన్న షాపు వాళ్ళు షెట్టర్ ఓపెన్ చేసుకుని రావడం గమనించిన దుండగులు వెంటనే వారిని పక్కకు తోసుకుంటూ బంగారంతో పరారయ్యారు. కాగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ లభ్యమైన తుపాకీ బుల్లెట్ షేల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈఘటన పై వైద్యులు సుఖేదేవ్ పరిస్థితి 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమన్నారు. బుల్లెట్ బయటికి తీస్తే గానీ సుఖేదేవ్ పరిస్థితి చెప్పలేమని పేర్కొన్నారు. కాగా.. రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. 15 టీమ్స్ తో నిందితుల కోసం గాలిస్తున్నామని.. గతంలో కూడా ఇలాంటి దోపిడీ జరిగిందన్నారు. నిందితులు యూపీ, బీహార్‌‌కు చెందిన వారిగా అనుమానిస్తున్నామని వివరించారు.

గోల్డ్ సప్లేయర్లను ముందే దుండగులు గుర్తించారని.. పక్కా రెక్కీ చేసి అట్టాక్‌‌కు ప్లాన్ వేశారని పేర్కొన్నారు. ఈ (Nagole Gold Theft Case) ఘటనలో 2కిలోల గోల్డ్ (Gold Theft), లక్ష డెబ్భై నగదును దుండగులు దొంగింలించారని.. ఎవరికి దొరక్కుండా ముందుగానే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా చూసుకున్నారని.. మెహానికి ముసుగు, హెల్మెట్ ధరించి దోపిడీకి పాల్పడ్డారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ (Rachakonda CP Mahesh Bhagwat) వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...