‘నల్గొండలో MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గెలవనివ్వను’

-

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)ని మళ్లీ ఓడిస్తానని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy) అన్నారు. నల్లగొండ ప్రజలు కేసీఆర్‌ వైపే ఉన్నారని తెలిపారు. నాలుగేళ్లలో నల్లగొండను ఎంతో అభివృద్ధి చేశామని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌ సభకు నిరుద్యోగులు ఎవరూ రాలేదని, కాంగ్రెస్ నిరుద్యోగులు మాత్రమే వచ్చారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే కోమటిరెడ్డి మళ్లీ నల్లగొండ నుంచే పోటీ చేయాలని, ఎలా గెలుస్తారో తానూ చూస్తానని భూపాల్ రెడ్డి(Bhupal Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం నల్లగొండ పట్టణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ రోడ్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు.

- Advertisement -
Read Also: కనీసం చనిపోయిన వ్యక్తి శవాన్ని కూడా చూపించరా?: RSP

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...