Nirmala Sitharaman: చేతులు జోడించి కేసీఆర్‌ను వేడుకున్న కేంద్ర మంత్రి

-

Nirmala Sitharaman fires on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై జోకులు వేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు పెరిగిందని విమర్శించారు. తమపై విమర్శలు చేస్తున్నారని, మరి మీ సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదని ఆమె ఎద్దేవా చేశారు.

- Advertisement -

కరీంనగర్‌, ఖమ్మంలో ఇప్పటికే మెడికల్‌ కాలేజీలున్నాయని, మళ్లీ ఆ జిల్లాల్లో కాలేజీలకే ప్రతిపాదనలు పెట్టారని నిర్మల ఎద్దేవా చేశారు. నెంబర్స్‌ చూసి విమర్శలు చేస్తే మంచిదని సూచించారు. నో డేటా గవర్నమెంట్ ఎవరిదో ఇప్పుడు అర్థమవుతుందని నిర్మల(Nirmala Sitharaman) వ్యాఖ్యానించారు. ప్రపంచంలో 192 దేశాలుంటే అందులో తలసరి ఆదాయ ర్యాంకింగ్‌లో ఇండియాది 139వ స్థానమని, మనకంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌ ముందున్నాయని చూపుతూ కేసీఆర్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ.. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కేంద్రంపై అసత్య ఆరోపణలు చేయొద్దు అంటూ చేతులు జోడించి స్పీట్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...